← Back to news

పేదలకు ఊరట.. తక్కువ ధరకే సన్నబియ్యం

By Prashanth· 13h ago
పేదలకు ఊరట.. తక్కువ ధరకే సన్నబియ్యం

AP: రాష్ట్రంలో బియ్యం ధరలు పెరుగుతున్న టైంలో రాష్ట్ర ప్రభుత్వం ‘ధరణి’ బ్రాండ్‌తో నాణ్యమైన సన్నబియ్యాన్ని తక్కువ ధరకు అందిస్తోంది. రైతుబజార్లలో కర్నూలు సోనా బియ్యం కేజీ र50, BPT బియ్యం కేజీ र49 చొప్పున అమ్ముతున్నారు. గతంలో ఒక్కొక్కరికి 10 కేజీలు మాత్రమే ఇవ్వగా.. సోమవారం నుంచి 26 కిలోల బస్తాలను ఇస్తున్నారు. గతవారం బియ్యం కొరత ఏర్పడటంతో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం సరఫరాపై కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

More in AP