APలో వేల ఓట్ల తొలగింపు రిక్వెస్టులు!

AP "సర్" ప్రక్రియలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 10 మధ్య.. ఓటర్ల పేర్ల తొలగింపు కోసం 40,006 ఫారం-7 అప్లికేషన్స్ వచ్చాయి. ఓట్లు ఎందుకు తొలగించాలో కారణాలు చెప్పలేదు. ఎన్నికల అధికారులు.. 20,959 అప్లికేషన్స్ని అభ్యంతరకరమైనవిగా నమోదు చేశారని "<a href="https://www.thenewsminute.com/andhra-pradesh/thousands-of-votes-marked-for-deletion-in-andhra-pradesh-without-reasons-on-record">ది న్యూస్ మినిట్</a>" రిపోర్ట్ చేసింది. టాప్ 20 నియోజకవర్గాల్లో 16,241 అప్లికేషన్స్ ఇలానే ఉన్నాయి. ఇంతలా ఓట్లను తొలగించమని ఎందుకు కోరుతున్నారనేది ఆశ్చర్యం కలిగిస్తోంది.



