PM సూర్య ఘర్ పథకంపై అవగాహన

నెల్లూరు జిల్లా రాపూరు విద్యుత్ శాఖ కార్యాలయంలో PM సూర్య ఘర్ సోలార్ పథకంపై విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు సేవా సేతు అభియాన్ నిర్వహించారు. గూడూరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, ప్రభుత్వ సబ్సిడీలు, నెట్ మీటరింగ్, విద్యుత్ ఆదాపై వివరించారు. అర్హులైన లబ్ధిదారులు ₹.78 వేల వరకు సబ్సిడీ పొందవచ్చని తెలిపారు. ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి సోలార్ ప్యానెళ్ల నమూనాలను ప్రదర్శించడంతో పాటు అక్కడికక్కడే రిజిస్ట్రేషన్లు నిర్వహించారు.



