← Back to news

విద్యుత్ షాక్‌తో రాజస్థాన్ యువకుడి మృతి

By YSR· 1h ago· Pinampally, Tirumalayapalem, Khammam
విద్యుత్ షాక్‌తో రాజస్థాన్ యువకుడి మృతి

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరులో విషాదం చోటుచేసుకుంది. స్థానిక SFS ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్టీల్ రైలింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ ఘాతంతో రాజస్థాన్‌కు చెందిన సునీల్ బిష్ణయ్ (20) మృతి చెందాడు. రైలింగ్ రాడ్ విద్యుత్ వైర్లకు తగలడంతో షాక్‌కు గురై కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు ఎంక్వేరీ చేస్తున్నారు.

More in Local