← Back to news

బీజేపీ కార్యకర్తల సమావేశం.. ఎన్నికలే లక్ష్యం!

By GOLLAPALLI SUDHAKAR RAO· 1h ago· Narrawada, Duttalur, Sri Potti Sriramulu Nellore
బీజేపీ కార్యకర్తల సమావేశం.. ఎన్నికలే లక్ష్యం!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడులో శుక్రవారం బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఎన్నికలే లక్ష్యంగా ఈ సమావేశాన్ని మండల ప్రధాన కార్యదర్శి పెసల కృష్ణ అధ్యక్షతన, యువమోర్చా అధ్యక్షుడు వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు. కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మేకపాటి మాల్యాద్రి నాయుడు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కృషి చేస్తోందని తెలిపారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు చుండి హరిగోపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

More in Local