← Back to news

నీరు, విద్యుత్ పొదుపుపై ప్రభుత్వం సూచనలు

By A.Ajay· 6h ago
నీరు, విద్యుత్ పొదుపుపై ప్రభుత్వం సూచనలు

TG: హైదరాబాద్‌లో ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రతి కుటుంబం రోజువారీ నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించాలని సూచించింది. తాగునీటిని వాహనాలు కడగడానికి వాడొద్దని కోరింది. కొత్త బోర్‌వెల్లకు అనుమతులు ఇవ్వకుండా, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (OC) ఉంటేనే కొత్త నల్లా కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని అధికారులు సూచించారు.

More in TG