దుర్గామాత మండపాలను సందర్శించిన CI

నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను CI సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని CI సూచించారు.


