భారీగా పెరిగిన యాపిల్ ఐ ప్యాడ్లు, మ్యాక్ బుక్ ల రేట్లు

యాపిల్ ప్రియులకు భారీ షాక్ తగిలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ల విస్తరణ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో మెమొరీ, స్టోరేజ్ చిప్‌ల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ చిప్‌ల కొరత భారాన్ని మోయలేక యాపిల్ సంస్థ తన మ్యాక్‌బుక్ (MacBook), ఐప్యాడ్ (iPad) మోడళ్ల ధరలను భారత్‌లో భారీగా పెంచేసింది. మోడల్‌ను బట్టి ధరలు రూ. 10,000 నుండి ఏకంగా రూ. 1,00,000 వరకు పెరిగాయి.



