దానం నాగేందర్.. బైఎలక్షన్‌కు సై!
తనపై ఎమ్మెల్యే అనర్హత కేసులో సుప్రీంకోర్టు పిటిషన్‌ను కొట్టివేయడంపై దానం నాగేందర్ స్పందించారు. కోర్టు తీర్పును అంగికరిస్తున్నానని చెప్పారు. ఎన్నికలను ఎదుర్కోవడం తనకు కొత్త కాదని, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. తప్పకుండా గెలిచి చూపిస్తానని అయన అన్నారు. తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కూడా స్పందిస్తూ.. తనను విమర్శించే ముందు గతంలో వాళ్లు ఏం చేశారో చూసుకోవాలని అన్నారు.



