← Back to news

మాజీ సీఎం పినరయి విజయన్‌కు మరో చిక్కు

By A.Ajay· 1d ago
మాజీ సీఎం పినరయి విజయన్‌కు మరో చిక్కు

కేరళ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత పినరయి విజయన్‌పై ఉన్న CMRL కేసు కొత్త టర్న్ తీసుకుంది. విజయన్‌, ఆయన కుమార్తె వీణ, అల్లుడు మహ్మద్ రియాస్‌పై FIR నమోదు చేయాలని కేరళ పోలీసులను ED కోరింది. CMRL నుంచి వీణకు చెందిన ‘Exalogic Solutions’ సంస్థ‌కు రూ.2.78 కోట్లు చెల్లించారని తెలిపింది. అవి సేవలకు కాకుండా ముడుపులుగా ఇచ్చినట్లు ED ఆరోపిస్తోంది. ఈ కేసులో ED సేకరించిన ఆధారాలను కేరళ DGPకి పంపించి, Prevention of Corruption Act కింద కేసు పెట్టాలని కోరింది.

More in Current Affairs

పిల్లల ఆన్‌లైన్ సేఫ్టీపై సుప్రీం కీలక కామెంట్స్
Current Affairs· 2h ago

పిల్లల ఆన్‌లైన్ సేఫ్టీపై సుప్రీం కీలక కామెంట్స్

పిల్లలు సోషల్ మీడియా వాడకంపై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది. పిల్లలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఈజీగా యాక్సెస్ చేస్తుండటంతో.. వారికి సేఫ్టీ గైడ్‌లైన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. ఆన్‌లైన్ వేధింపుల నుంచి మైనర్లను ఎలా కాపాడతారో చెప్పాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ పిటిషన్‌పై విచారణలో ఈ కామెంట్స్ చేసింది. ఆటో కంటెంట్ ఫిల్టర్లు, ఏజ్ వెరిఫికేషన్ ఉండాలని పిటిషనర్లు కోరారు. అల్గారిథమ్స్ పిల్లలకు ఏజ్‌కు మించిన కంటెంట్ చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.