'మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి'

కూకట్‌పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్‌పల్లిలో పచ్చదనం పెంపొందించేందుకు మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ ఆధ్వర్యంలో 1,000 మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కోరారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం అందించేందుకు మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.



