← Back to news

స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరుతో వసూళ్లు!

By A.Ajay· 1d ago
స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరుతో వసూళ్లు!

TG: స్టాఫ్ నర్స్, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ ఉన్నతాధికారిణి, మరో ఇద్దరు కలిసి 19 లక్షల రూపాయలు తీసుకున్నారన్న కంప్లయింట్‌పై ప్రభుత్వం విచారణ జరిపించింది. తెలంగాణ కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ ఆధ్వర్యంలోని కమిటీ బాధితులను విచారించింది. డబ్బుల వ్యవహారం జరిగినట్లు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. పోలీసు కేసు తర్వాత బాధితులకు 10 లక్షలు తిరిగి ఇచ్చినట్లు విచారణలో గుర్తించారు. సంబంధిత అధికారిణిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించినట్లు తెలుస్తోంది.

More in TG