పోలీసులకు DGP సీరియస్ వార్నింగ్

TG: తెలంగాణ DGP C.V ఆనంద్ పోలీసు సిబ్బందికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. యూనిఫామ్లో డ్యాన్సులు చేయడం, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఇటీవల యూనిఫామ్లో పోలీసులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు వైరల్ కావడంతో ఈ ఆదేశాలు ఇచ్చారు. యూనిఫామ్ భాధ్యత, క్రమశిక్షణకు ప్రతీక అని, దాని గౌరవాన్ని కాపాడాలని అన్నారు, రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు శాఖ ప్రతిష్ఠను కాపాడటమే ఈ ఆదేశాల లక్ష్యం అని తెలిపారు.
