← Back to news

కాకరవాయి రైతులకు సాగునీటి కష్టాలు

By Yellimalla Srinivasarao· 1h ago· Pinampally, Tirumalayapalem, Khammam
కాకరవాయి రైతులకు సాగునీటి కష్టాలు

తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో వర్షాలు ఆశించిన స్థాయిలో లేక చెరువులు, కుంటల్లో నీరు తగ్గిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ కోతలు, లో-వోల్టేజీ కారణంగా మోటార్లు సక్రమంగా పనిచేయడం లేదని తెలిపారు. పంటలకు కీలక దశలో సాగునీరు అందకపోతే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. భక్త రామదాసు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా చెరువులకు నీటిని మళ్లించి నింపాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.

కాకరవాయి రైతులకు సాగునీటి కష్టాలు

More in Local