పెండింగ్ దరఖాస్తులపై కలెక్టర్ కీలక ఆదేశాలు

పెన్షన్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. ఇవాళ్టితో (ఈనెల 16తో) దరఖాస్తుల గడువు ముగియనున్న నేపథ్యంలో పొదిలి ఎంపీడీవో కార్యాలయం, సచివాలయం-5, తలమల్ల సచివాలయాల్లో నూతన పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ ప్రక్రియను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటివరకు ఆన్‌లైన్ చేసినవి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శుల నుంచి పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.



