← Back to news

గురిజాలలో ఎండిపోయిన పంటలు

By VIJAY KUMAR· 1d ago· Warangal
గురిజాలలో ఎండిపోయిన పంటలు

వరంగల్ జిల్లా గురిజాలలో ఎండిపోయిన వరి పంటలను రైతులతో కలిసి తెలంగాణ రక్షణ సేన నేత బోడ అనిల్‌కుమార్ నాయక్ పరిశీలించారు. పవర్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్లే పంటలు ఎండిపోయాయని మండిపడ్డారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి ₹50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 24 గంటల కరెంట్ ఇవ్వకపోతే సబ్‌స్టేషన్‌ను ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

గురిజాలలో ఎండిపోయిన పంటలు

More in Local