గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈనెల 3న వేటకు వెళ్లిన బోటు 16వ తేదీకి తిరిగి రాకపోవడంతో కుటుంబాలు అధికారులకు సమాచారం ఇచ్చాయి. కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసు లు, నేవీ డార్నియర్ విమానాలతో 216 నాటికల్ మైళ్ల పరిధిలో గాలింపు చేపట్టారు. ఇలాంటి ఘటనలు నివారించేందుకు ఎస్‌ఓపీ అమలు చేసి, ప్రతి బోటు, మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.



