వినాయకచవితిపై పీస్ కమిటి సమావేశం

TG: వినాయకచవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని వేంసూరు ఎస్సై పల్లెల ప్రదీప్ సూచించారు. ఖమ్మం జిల్లా వేంసూరు పోలీస్ స్టేషన్‌లో సోమవారం సాయంత్రం మతపెద్దలు, ప్రముఖులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను వివరించి, వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అందరూ సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భక్తిశ్రద్ధలతో పండుగను నిర్వహించాలని సూచించారు.





