చిలువూరులో అభివృద్ధి పనులకు భూమిపూజ
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు దళితవాడలో ₹.20 లక్షలతో చేపట్టనున్న కాలువల నిర్మాణ పనులకు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఈ పనులు చేపట్టనున్నారు. కార్యక్రమానికి TDP గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, ప్రజాప్రతినిధులు, TDP నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


