← Back to news

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

By YSR· 2h ago· Pinampally, Tirumalayapalem, Khammam

ఖమ్మం జిల్లా పిండిప్రోలు ప్రభుత్వ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని పూల బతుకమ్మలతో వేడుకలు జరుపుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఎస్. రామకృష్ణ, సర్పంచ్ సువార్త, వైస్ సర్పంచ్, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ నారాయణరావు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించారు. ఇలాంటి వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై గౌరవాన్ని పెంచుతాయని తెలిపారు.

More in Local