← Back to news

'మున్సిపాలిటీల్లో ఉపాధి పనులు కల్పించాలి'

By Mogili· 2h ago· Kothakota Ward No.-0001, Kothakota, Wanaparthy
'మున్సిపాలిటీల్లో ఉపాధి పనులు కల్పించాలి'

వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కమిషనర్ సయ్యద్‌కు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఇవాళ వినతిపత్రం అందజేశారు. గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో ఉపాధి పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని సంఘం ఉపాధ్యక్షుడు మండ్ల సత్యనారాయణ అన్నారు. కరువు మండలాలుగా ప్రకటించాలని, భూమిలేని ఏడాదికి ₹.12 వేల సాయం అందించాలని, మున్సిపాలిటీల్లో ఉపాధి పనులు కల్పించి రోజువారీ కూలీ ₹.400 ఇవ్వాలన్న హామీని అమలు చేయాలన్నారు.

'మున్సిపాలిటీల్లో ఉపాధి పనులు కల్పించాలి'
'మున్సిపాలిటీల్లో ఉపాధి పనులు కల్పించాలి'

More in Local