← Back to news

ఎర్రవల్లి భూముల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

By Vishi· 4d ago
ఎర్రవల్లి భూముల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

TG: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. రెండు గ్రామాల్లో సర్వే వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఎర్రవల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూమి ఉందని, రెవెన్యూ అధికారుల సర్వేలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. సర్వే నంబర్‌లో 45 ఎకరాల భూమి మిస్సయిందన్నారు. ఆ భూమి ఎకరాలు ఎక్కడుందో తేల్చాలని సీఎం అధికారులను ఆదేశించారు.

More in Politics