ఈ కానిస్టేబుల్... సూపర్ హీరో

కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. అన్నవరం వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్న ప్రేమ్‌కుమార్ గణేష్, తుని స్టేషన్‌లో రైలు ఆగిన తర్వాత దిగి మళ్లీ ఎక్కే క్రమంలో రైలు, ప్లాట్‌ఫాం మధ్య పడిపోయాడు. అదే రైలులో ప్రయాణిస్తున్న యలమంచిలి గ్రామీణ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ చంద్రారావు వెంటనే స్పందించారు. రైలు నిలిపేసి, కిందకు దూరి వ్యక్తిని ప్లాట్‌ఫాంపైకి తీశారు. 108లో తుని ఆసుపత్రికి, అక్కడి నుంచి కాకినాడకు తరలించారు. ప్రాణాపాయం తప్పిందని SI సత్తిబాబు తెలిపారు. ఇలాంటే హీరోలే కావాలి కదా!



