చిన్నారి ముక్కులో చాక్‌పీస్

TG: మేడ్చల్ జిల్లా నూతన్‌కల్ ప్రాథమిక పాఠశాలలో ఓ చిన్నారి చాక్‌పీస్‌ను ముక్కులో పెట్టుకుని ఇబ్బందికి గురైంది. 1వ తరగతి చదువుతున్న విద్యార్థిని పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న 108 EMT యాదమ్మ, పైలట్ తిరుపతి చాకచక్యంగా చిన్నారి ముక్కులో ఇరుక్కున్న చాక్‌పీస్‌ను సురక్షితంగా తొలగించారు. దీంతో ప్రమాదం తప్పి చిన్నారి క్షేమంగా బయటపడింది. సమయానికి స్పందించి ప్రాణాపాయం తప్పించిన వైద్య సిబ్బందికి చిన్నారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.



