5 స్టార్ హోటల్‌లో వాష్‌రూమ్‌కు నో.. వీడియో వైరల్
ఢిల్లీలోని Shangri-La Eros హోటల్‌లో వాష్‌రూమ్ వాడేందుకు వెళ్లిన తనను అనుమతించలేదని ఓ మహిళ చెప్పింది. తాను హోటల్ గెస్ట్ కాదనే కారణంతో వాష్‌రూమ్‌కు అనుమతి ఇవ్వలేదని ఆమె తెలిపింది. ఈ ఘటనను వీడియోగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. హోటళ్లలో నాన్-గెస్టులకు వాష్‌రూమ్ వాడే అవకాశం ఉండాలా? అంటూ నెటిజన్లు చర్చిస్తున్నారు. కొందరు హోటల్ సెక్యూరిటీని సమర్థిస్తుండగా.. మరికొందరు ఎమర్జెన్సీలో వాష్‌రూమ్ వాడేందుకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు.
