రాహుల్ చెప్పేవరకు ఢిల్లీని వీడొద్దు.. రేవంత్ ఆదేశం

ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ నేతలు తాము చెప్పేవరకు అక్కడి నుంచి వెళ్లొద్దని CM రేవంత్ రెడ్డి సూచించారు. ఈ ప్రొటెస్ట్ ఒక్కరోజులో ముగిసేది కాదన్నారు. రాహుల్ గాంధీ ఎన్ని రోజులు ఉండాలో ఇంకా చెప్పలేదని, అందుకే రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకోవద్దన్నారు. నేతలను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని తెలిపారు. వారికి సాయం చేసేందుకు 24 గంటలూ హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ బాధ్యతలను MPలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించారు.


