ఒకే బస్సులో 109 మంది పిల్లలా?

TG : సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయ పిల్లల ట్రాన్స్‌పోర్ట్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఒక్క RTC బస్సులోనే ఏకంగా 109 మంది పిల్లలు ప్రయాణిస్తున్నారు. కలెక్టర్‌కు కంప్లైంట్ చేసినా స్పందించలేదని, వెంటనే మరిన్ని బస్సులు వేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు వెళ్తామని హెచ్చరించారు. మాజీ సర్పంచుల JAC అధ్యక్షుడు కరుణాకర్ కూడా అధికారులను స్పందించాలని కోరారు.



