← Back to news

నడవడానికి కూడా వీల్లేని దారి!

By Korra Arun Kumar· 2h ago· Alluri Sitharama Raju
నడవడానికి కూడా వీల్లేని దారి!

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ పరిధిలోని గిల్లలబంద గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డు భారీ వర్షాలకు దెబ్బతింది. కొండచరియలు విరిగిపడటంతో పాటు వరద ఉధృతికి రోడ్డు కొట్టుకుపోయి, గోతులు ఏర్పడ్డాయి. దీంతో కాలినడకన వెళ్లడం కూడా ప్రమాదకరంగా మారగా, బైక్‌ల రాకపోకలు నిలిచిపోయాయి. అంబులెన్స్ వెళ్లే దారి లేక రోగులు, గర్భిణులను డోలీల్లో మోసుకెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులే పారలు, గునపాలతో రోడ్డు బాగు చేసుకుంటున్నారు.

నడవడానికి కూడా వీల్లేని దారి!
నడవడానికి కూడా వీల్లేని దారి!

More in Local