మహిళపై పిట్‌బుల్ దాడి.. షాకింగ్ వీడియో
హర్యానాలోని సోనిపట్‌లో పిట్‌బుల్ కుక్క దాడి ఘటన కలకలం రేపింది. ఇంటి బయట ఆరు నెలల చిన్నారిని ఎత్తుకుని నడుస్తున్న ఓ మహిళపై కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుక్క దాడిపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ ఘటనలో మహిళ, చిన్నారికి గాయాలయ్యాయా? అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
