"అక్కడ వారు జెండా ఊపారు"
CJP ఫౌండర్ అభిజీత్ దీప్కేని ఢిల్లీ పోలీసులు డిటైన్ చేసిన సమయంలో.. కొంతమంది కన్నాట్ ప్లేస్ ఇన్నర్ సర్కిల్ దాకా రాగలిగారు. అక్కడి పాలికా బజార్.. గేట్ 2 దగ్గరకు చేరుకున్న వారు.. జాతీయ జెండాను చేతిలో పట్టుకొని ఊపడం కనిపించింది. కన్నాట్ ప్లేస్ లోని సెంట్రల్ పార్కులో జెండా ఎగరేద్దామన్న అభిజీత్ దీప్కే పిలుపుతో వారు అక్కడికి వచ్చారు. దీప్కే కోరినట్లుగా వారు జెండాని ఊపడం ద్వారా.. కేంద్రానికి సవాల్ విసిరారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ జెండా ఎగరనివ్వకుండా చెయ్యాలని కేంద్రం ప్లాన్ చేసింది.


