బాలాజీ స్కూల్లో మట్టి గణపతి పోటీలు..!

వరంగల్ జిల్లా నర్సంపేటలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్లో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులకు మట్టి గణపతుల తయారీ పోటీ నిర్వహించారు. బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డా. రాజేంద్రప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పర్యావరణాన్ని రక్షించేందుకు మట్టి విగ్రహాలనే పూజించాలని సూచించారు. రసాయనాలు, POP విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని అవగాహన కల్పించారు.



