గుండు పిన్నుపై మట్టి గణపతి
TG: గణపతి నవరాత్రుల సందర్భంగా గుండు పిన్నుపై మట్టి గణపతిని రూపొందించారు. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గౌరవ డాక్టరేట్, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత డాక్టర్ గుర్రం దయాకర్ ఈ ప్రత్యేక విగ్రహాన్ని తయారు చేశారు. ప్రతి ఏడాది వినూత్న గణపతి విగ్రహాలను రూపొందించే దయాకర్.. ఈసారి పర్యావరణ పరిరక్షణ సందేశంతో మట్టి గణపతిని తీర్చిదిద్దారు. గుండు పిన్ను, మట్టి, వాటర్ కలర్స్‌ను ఉపయోగించి సుమారు 10 గంటలపాటు శ్రమించి విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలిపారు.

