శంషాబాద్‌లో ట్రావెల్స్ బస్సు బీభత్సం
TG: శంషాబాద్‌లో ఓ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పింది. కంటైనర్‌ను తప్పించబోయి పక్కనే ఉన్న బాలాజీ భవన్ హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో.. హోటల్‌లో టీ తాగుతున్న వ్యక్తి మృతి చెందగా.. మరో 50 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఆ బస్సు.. సెవెన్ హిల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలిస్తున్నారు.


