రాజమౌళి 'వారణాసి' రెండు భాగాలుగా?

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోయే తదుపరి చిత్రం 'వారణాసి' రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాదాపు రూ. 1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో, అత్యంత భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారట. గతంలో వచ్చిన ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రాల తరహాలోనే ఈ భారీ కథను కూడా రెండు భాగాలుగా చూపించేలా మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే, గతంలో రాజమౌళి ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది కేవలం ఒకే భాగం (స్టాండ్‌అలోన్) చిత్రమని స్పష్టం చేశారు. మరి తాజా ప్రచారంలో ఎంతవరకు నిజముందో .



