← Back to news

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా విద్యార్థులకు పోటీలు

By Chippa Naga· 6h ago· Warangal
పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా విద్యార్థులకు పోటీలు

వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21 నుంచి 31 వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించనున్నారు. వ్యాసరచన, ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిల్మ్ పోటీలు ఉంటాయని ఎస్సై సాయి ప్రసన్నకుమార్ తెలిపారు. వ్యాసాలను అక్టోబర్ 24లోగా ఆన్‌లైన్‌లో పంపాలని, ఫొటోలు, షార్ట్‌ఫిల్మ్‌లను అక్టోబర్ 23లోగా హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో అందజేయాలని సూచించారు.

More in Local