ఉండవల్లి సెంటర్లో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
AP: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని రోటరీ క్లబ్ సభ్యులు సూచించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లి సెంటర్‌లో వినాయక చవితిని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులకు మట్టి విగ్రహాలను ఉచితంగా అందజేశారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనం వల్ల నీటి వనరులు కలుషితమవుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి హాని తగ్గించవచ్చని పేర్కొన్నారు.
