విగ్రహం పూజకు... విత్తనం భవిష్యత్తుకు

"విగ్రహం పూజకు... విత్తనం భవిష్యత్తుకు" అనే మెసేజ్‌తో హరిత సేన టీమ్ విత్తన గణపతులను పంపిణీ చేస్తోంది. భూపాలపల్లి సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డికి సభ్యుడు ముస్కె లక్ష్మణ్ విత్తన వినాయక విగ్రహాన్ని అందించారు. మాజీ MP జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తెచ్చిన ఈ ఐడియాను ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుతూ పచ్చదనం పెంచడానికి అందరూ విత్తన గణపతులనే పూజించి మొక్కలు నాటాలని కోరారు. మీ ఊరి మట్టి గణేశ్‌తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.
