BRS బలోపేతానికి ఉద్యమకారులు సిద్ధం!

నారాయణపేట జిల్లా నర్వ మండలానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారులు, సీనియర్ నాయకుడు, మాజీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ దేవరి మల్లప్ప ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీశ్రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా KCR పిలుపు మేరకు BRS భవిష్యత్ కార్యాచరణలో ఉద్యమకారులు భాగస్వాములు కావాలని హరీశ్రావు కోరినట్లు తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఉద్యమకారులు అండగా నిలవాలని దేవరి మల్లప్ప పేర్కొన్నారు.



