← Back to news

స్టూడెంట్స్ బీ అలర్ట్!

By sahani· 15 Jul 2026· Telangana
స్టూడెంట్స్ బీ అలర్ట్!

తెలంగాణలోని విద్యాసంస్థల్లో డ్రగ్స్‌ను పూర్తిగా అరికట్టేందుకు DGP C.V. ఆనంద్ 'ఈగల్' అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. క్యాంపస్‌లలో 'Zero Tolerance' పాలసీని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి కాలేజ్, స్కూల్‌లో 'Anti-Drugs and Safety Committees' తో పాటు ఒక 'Safety Coordinator'ని తప్పనిసరిగా నియమించాలి. రూల్స్ బ్రేక్ చేసే కాలేజీల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం 'SOPs' రిలీజ్ చేయనున్నారు. స్టూడెంట్స్ కోసం సైకాలజిస్ట్‌లు, కౌన్సెలర్స్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

More in Education