అభిజీత్కి పోలీసుల Notice

CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే ఇంటికి వెళ్లిన ఢిల్లీ పోలీసులు ఆయనకు నోటీస్ ఇచ్చారు. కన్నాట్ప్లేస్లోని సెంట్రల్ పార్క్లో సాయంత్రం 5 గంటలకు పిలుపిచ్చిన ‘లెహ్రా దో తిరంగా’ ర్యాలీకి అనుమతించట్లేదని తెలిపారు. ప్రస్తుతం అక్కడ BNS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. NDMC సెంట్రల్ పార్క్ను ఇవాళ, రేపు మూసివేస్తోంది. 25 వేల మందికి పైగా పోలీసులు, పారామిలిటరీ బలగాలు మోహరించారు. ఈ ర్యాలీని హైకోర్టు నిషేధించలేదు. కానీ పోలీసులు చట్టబద్ధంగా ర్యాలీని కంట్రోల్ చేస్తామని తెలిపారు.


