చెవికి గాయమయ్యేలా పోలీసులు కొట్టారు

ఢిల్లీలో నిరసన సందర్భంగా పోలీసులు తనను పక్కకు తీసుకెళ్లి కొట్టారని కేరళంకు చెందిన 27 ఏళ్ల ఫిడల్ రోయాస్ ఆరోపించారు. ఈ నెల 11న కన్నాట్ ప్లేస్లో అదుపులోకి తీసుకున్న తర్వాత, బస్సులో నిరసనకారులపై దాడిని వీడియోలో వివరిస్తుండగా తనపై దాడి చేశారని చెప్పారు. ఈ దాడిలో కుడి చెవి దెబ్బతిని వినికిడి తగ్గిందని. సర్జరీ అవసరమా లేదా అనేది వైద్యులు తేల్చనున్నారని అన్నారు. మరోవైపు, నిరసనకారులపై పోలీసులు దాడి చేస్తున్నట్లు కనిపించే వీడియోలు SMలో వైరల్గా మారయి.


