హైదరాబాద్లో అర్ధరాత్రి పోలీసుల మెగా ఆపరేషన్!
TG: హైదరాబాద్లో క్రైమ్ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఆపరేషన్ కవచ్ చేపట్టారు. గురువారం అర్ధరాత్రి 3 వేల మంది సిబ్బంది, 100 టీమ్లతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో రూల్స్ బ్రేక్ చేసిన 725 వాహనాలను డిటైన్ చేయగా, 48 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిటీలో నేరాలను అరికట్టేందుకు రాత్రి వేళల్లో ఇలాంటి డ్రైవ్స్ కొనసాగుతాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ C.V. సజ్జనార్ తెలిపారు. అనుమానాస్పదంగా కనిపిస్తే 112కు కాల్ చేయాలని కోరారు.
