పోలీస్ కార్యాలయంలో సీపీ ఆకస్మిక తనిఖీ

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సీపీ అంబర్ కిషోర్ ఝా ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. DCRB, ఏబీ సెక్షన్లు, ఫింగర్ ప్రింట్, D4C కమాండ్ కంట్రోల్ విభాగాల్లో రికార్డులు, పెండింగ్ కేసులు, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు. నేరాలకు సంబంధించిన సమాచారాన్ని పొరపాట్లకు తావులేకుండా భద్రపరచాలని, ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. పెండింగ్ రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.



