కొనుగోలు వెంటనే స్టార్ట్ చేయాలి.. రైతు సంఘం డిమాండ్!

రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించి, ప్రభుత్వ కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్ డిమాండ్ చేశారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లాలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ను రైతు సంఘం బృందంతో కలిసి పరిశీలించి, వడ్లు, మొక్కజొన్న, పత్తి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ కార్యదర్శి అహమద్కు వినతిపత్రం అందజేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.



