దాచేపల్లిలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి కీలక నేత

AP: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ 20వ వార్డులో టీడీపీ నాయకుడు ముశ్యాం శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసరావుకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాబోయే 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు. కాసు మహేష్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని తెలిపారు.



