అంకిత కేసులో గౌతమ్‌కు 24 గంటల డెడ్‌లైన్

2022లో ఉత్తరాఖండ్‌లో హత్యకు గురైన అంకిత భండారి తల్లిదండ్రులు కీలక డిమాండ్ చేశారు. దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్ పదవి నుంచి 24 గంటల్లో తొలగించాలని, లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని అంకిత తండ్రి హెచ్చరించారు. CBI విచారణ పూర్తయ్యే వరకు గౌతమ్‌ను ఆ పదవిలో కొనసాగించకూడదని డిమాండ్ చేశారు. మరోవైపు, గౌతమ్ నియామకాన్ని మరోసారి పరిశీలించాలని రాహుల్ గాంధీ రాష్ట్రపతికి లేఖ రాశారు.


