బహుజన హక్కుల కోసం పాదయాత్రకు తరలిరావాలి

నాగర్కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న చేపట్టిన పాదయాత్ర ఈ నెల 15న చేరుకోనుంది. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బహుజన నాయకుడు వేముల ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. రాజకీయాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని, ఆత్మగౌరవం, చట్టబద్ధమైన హక్కుల సాధనే లక్ష్యంగా ఈ పోరాటం సాగుతోందని తెలిపారు.


