మత్తు మందు ఇచ్చి కుక్కతో ప్రయాణం.. నిద్రలేచాక అసలు రచ్చ మొదలైంది!
భారతీయ రైల్వేలో నిబంధనలకు విరుద్ధంగా కుక్కను తరలిస్తూ ఓ జంట పట్టుబడిన ఘటన కలకలం రేపింది. అధికారుల కళ్లు గప్పేందుకు వారు కుక్కకు నిద్రమాత్రలు ఇచ్చి బెర్త్ కింద దాచారు. ప్రయాణంలో కుక్కకు మత్తు వదిలి, అది స్పృహలోకి వచ్చి కోచ్‌లో రచ్చ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రయాణికుల ఫిర్యాదుతో స్పందించిన రైల్వే అధికారులు ఆ జంటను తర్వాతి స్టేషన్‌లో కిందకు దింపేసి విచారణ చేపట్టారు. మూగజీవి ప్రాణాలతో చెలగాటమాడటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



