← Back to news

"భాగ్ నేహా భాగ్".. ఈ గేమ్ చూశారా?

By Krishna· 1d ago· Instagram

అనవ్ నాయర్, అక్షయ్ నాయర్ బ్రదర్స్ సృష్టించిన ‘భాగ్ నేహా భాగ్’ సెటైరికల్ ఎండ్‌లెస్ రన్నర్ గేమ్.. వైరల్ అయ్యింది. ఇది సబ్‌వే సర్ఫర్స్ స్టైల్‌లో ఉంటుంది. ఇందులో నేహా బోరా తరహా కేరక్టర్.. ఢిల్లీ వీధుల్లో బ్యారికేడ్లు దాటుతూ.. ఖాకీ, ఆరెంజ్ డ్రెస్సుల వేటగాళ్ల నుంచి తప్పించుకుంటూ.. ‘డెమొక్రసీ కాయిన్స్’ సేకరిస్తుంది. పట్టుబడితే ‘పకడీ గయీ’ అని వస్తుంది. దేశ పాలిటిక్స్, ప్రొటెస్టుల ప్రేరణతో వచ్చిన ఈ గేమ్ కావాలంటే DM చెయ్యమని అనవ్ నాయక్ కోరారు.

More in National