"మోదీకి ఎందుకంత భయం?": అభిజీత్ దీప్కే
ఢిల్లీ.. కన్నాట్ ప్లేస్ లోని సెంట్రల్ పార్క్ దగ్గర 6,000 మందికి పైగా పోలీసులు ఉన్నారు. అదనంగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) నుంచి 220 కంపెనీలు మోహరించాయి. అంటే వారు మొత్తం 22,000 మంది ఉన్నారు. మరో 5,000 మందిని రిజర్వుగా ఉంచారు. CJP ఇవాళ సాయంత్రం సెంట్రల్ పార్కులో తలపెట్టిన ‘లెహ్రా దో తిరంగా’ కార్యక్రమానికి బ్రేక్ వేసేందుకు ఇంత మంది మోహరించారు. తిరంగా అంటే ప్రధాని మోదీకి ఎందుకంత భయం అని అభిజీత్ దీప్కే ప్రశ్నించారు.


